ఇంజనీరింగ్‌,మెడికల్‌ కాలేజీల్లో విద్యార్థినులకు 33% సీట్లు

ఇంజనీరింగ్‌,మెడికల్‌ కాలేజీల్లో విద్యార్థినులకు 33% సీట్లు

మహిళలు ఉన్నత చదువులు చదివేలా వారిని ప్రోత్సహించేందుకు బీహార్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ముఖ్యంగా ఇంజనీరింగ్‌, మెడికల్‌ కాలేజీల్లో 33% సీట్లను విద్యార్ధినులకు కేటాయించాలని ఆ రాష్ట్ర సీఎం నితీష్‌ కుమార్‌ ప్రతిపాదన చేశారు. రాష్ట్రంలో వైద్య, ఇంజనీరింగ్‌ వర్శిటీ ఏర్పాటు గురించి ఆరోగ్య, విజ్ఞాన, సాంకేతిక విభాగాలు ఇచ్చిన ప్రజెంటేషన్లు పరిశీలిస్తున్న సమయంలో ఈ ప్రతిపాదన చేశారు. యూనివర్శిటీల ఏర్పాటు చేయడంతో ఇంజనీరింగ్‌, మెడికల్‌ కాలేజీల్లో మెరుగైన నిర్వహణకు ఉపయోగపడుతుందని భావించిన ఆయన.. 33% సీట్లను విద్యార్థినులకు కేటాయించాలని అన్నారు. టెక్నికల్ సంస్థల్లో విద్యార్ధినుల సంఖ్య అధికంగా నమోదు అయ్యేలా చూడాలన్నారు. తగినంత సంఖ్యలో ఇంజనీరింగ్‌, మెడికల్‌ కాలేజీలను ఏర్పాటు చేయడంతో ఈ విభాగాలపై ఆసక్తి ఉన్న విద్యార్ధి, విద్యార్థునులు ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లాల్సిన అవసరం ఉండబోదన్నారు సీఎం నితీష్ కుమార్.